![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -88 లో...... ప్రేమని శాశ్వతంగా వాళ్లింటికి తీసుకొని వెళ్ళడానికి భద్రవతి కుట్ర చేస్తుంది. అందులో భాగంగా నగలు దొంగతనం చేసి రామరాజుని అరెస్ట్ చేపిస్తుంది. ప్రేమని పంపించడానికి రామరాజు ఒప్పుకోకపోవడంతో అతడిని పోలీసులు జైలుకి తీసుకొని వెళ్తామని అంటారు. వద్దు తప్పు చేసింది నేనే.. నగలు నావి నన్ను తీసుకొని వెళ్ళండి అని ప్రేమ అడ్డుపడుతుంది. నన్ను కాదని తీసుకొని వెళ్తే మాత్రం నేను కోర్ట్ కి వచ్చి.. ఇదే చెప్తాను లేకపోతే ఇప్పుడే చచ్చిపోతానని ప్రేమ అంటుంది. నాకు వారం టైమ్ ఇవ్వండి అని ప్రేమ అడుగుతుంది.
ఎన్ని సార్లు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తావంటూ ప్రేమని విశ్వ కోప్పడతాడు. సీఐ వాళ్ళు భద్రవతి వాళ్ళని పక్కకి తీసుకొని వెళ్లి.. ప్రేమ ఇలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయ్.. ఎలాగు వారం రోజుల్లో తెస్తానంటుంది కదా అని భద్రవతితో సీఐ చెప్తాడు. భద్రవతి కూడా సరే అంటుంది. మీకు వారం టైమ్ ఇస్తున్న అప్పుడు ఇవ్వకపోతే ఇద్దరిని అరెస్ట్ చేస్తానని సీఐ చెప్పి వాళ్ళని పంపిస్తాడు. రామరాజు బాధపడుతుంటే వేదవతి వస్తుంది. జరిగిన దాని గురించి మర్చిపోండి అని అంటుంది. వాడు నగలు తీసుకొని వెళ్లి అమ్ముకున్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను.. అయిన వారం రోజుల్లో నగలు తీసుకొని వస్తానంటున్నారు ఎలా తీసుకొని వస్తారని రామరాజు అంటాడు. మరొకవైపు సాగర్ చందులు నీ వల్లే నాన్న పోలీస్ స్టేషన్ కీ వెళ్ళాల్సి వచ్చిందంటూ కోప్పడుతున్నా అసలు విషయం ధీరజ్ చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. అదంతా ప్రేమ చూస్తుంది.
మరుసటి రోజు ఉదయం ప్రేమకి నర్మద కాఫీ తీసుకొని వెళ్తుంది. కానీ తను ఎక్కడ కన్పించదు. దాంతో అందరు కంగారు పడతారు. వేదవతి కోపంగా భద్రవతి దగ్గరికి వెళ్లి.. నా కోడలు ఎక్కడ అని అడుగుతుంది. తరువాయి భాగంలో అందరు ప్రేమ గురించి వెతుకుతుంటారు. ధీరజ్ కి ప్రేమ కన్పిస్తుంది. దాంతో ప్రేమ చెంపచెల్లుమనిపిస్తాడు ధీరజ్. తిరిగి ప్రేమ కూడా ధీరజ్ ని కొడుతుంది. ఆ కళ్యాణ్ గాడు నగలు తీసుకొని వెళ్ళేటప్పుడు నీకు ఎదురుపడ్డాడు కదా పట్టుకోకుండా ఏం చేసావని ప్రేమ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |